Header Banner

డీమార్ట్ ఓనర్‌కి రూ.64 వేల కోట్లు లాస్! కారణం ఏంటంటే!

  Wed Feb 19, 2025 08:30        Business

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొన్ని నెలలుగా భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. అప్పుడప్పుడు కాస్త తేరుకున్నట్లు కనిపించినా తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు తమ సంపదను తరలిస్తుండడంతో సూచీలు పతనమవుతున్నాయి. ఈ కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లకు నష్టాలు వచ్చాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వారు నష్టాలు చూసి భయపడుతున్నారు. ఇలా సాధారణ మదుపరులే కాదు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లుగా పేరొందిన వారు సైతం తీవ్రంగా నష్టపోయారు. ఆ వివరాలు తెలుసుకుందాం. 

 

గత ఏడాది సెన్సెక్స్ ఓ స్థాయిలో 85 వేల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. నిఫ్టీ 26 వేల మార్క్ అందుకుంది. ఆ తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగారు. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితులు, మాంద్యం భయాలు మార్కెట్లు పడేందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్ 11 శాతం మేర కరెక్షన్‌కి లోనే ప్రస్తుతం 75 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఏకంగా 15 శాతం మేర పడిపోయి 22,800 స్థాయిలో కొనసాగుతోంది. అక్టోబర్ 1, 2024 నుంచి గణాంకాలు పరిశీలిస్తే ప్రముఖ టాప్-10 ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలు ఏకంగా రూ.81 వేల కోట్ల మేర నష్టపోయినట్లు ప్రైమ్ ఇన్ఫోబేస్ రిపోర్ట్ తెలిపింది. అంటే దాదాపు 30 శాతం సంపద కోల్పోయారు. జనవరి 1, 2025 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 25 శాతం మేర నష్టపోయినట్లు నివేదిక తెలిపింది. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

డీమార్ట్ పేరుతో రిటైల్ ఛైన్ నిర్వహిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రాధాకృష్ణ ధమానీ సంపద గతేడాది అక్టోబర్ 1 నుంచి చూసుకుంటే ఏకంగా 28 శాతం మేర క్షీణించింది. అంటే దాదాపు రూ.64 వేల కోట్లు ఆయన సంపద తగ్గిపోయింది. ఆయన పోర్ట్ ఫోలియో విలువ రూ.2.31 ల7ల కోట్ల నుంచి రూ.1.67 లక్షల కోట్లకు తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది. 

 

అలాగే దిగ్గజ మదుపరి, దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం సైతం భారీగా నష్టపోయింది. ఆయన కుటుంబ సంపద 18 శాతం మేర క్షీణించినట్లు నివేదిక తెలిపింది. కుటుంబ పోర్ట్ ఫోలియో విలువ ప్రస్తుతం రూ.59,709 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. వీరితో పాటుగా హేమంత్ కొఠారి 28 శాతం, ఆకాశ్ బన్సాలీ 15 శాతం మేర సంపద కోల్పోయారు. ముకుల్ అగర్వాల్, నిమేశ్ షా, ఆశిష్ ధావన్, యుసఫ్పాలీ కదేర్, అనిల్ కుమారు గోయల్ వంటి దిగ్గజ మదుపరులు సంపద కోల్పోయిన టాప్-10 జాబితాలో ఉన్నారు. అలాగే హితేష్ దోషి, విజయ్ కేడియా, విశ్వాస్ పటేల్, అనుజ్ సేథ్ వంటి ప్రముఖులు సైతం భారీగానే నష్టపోయినట్లు నివేదిక పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business #Dmart #Losses #Profits